వాలెంటైన్ వీక్: దిగులు పడుతున్న తేజూ మనసు.. ! 🤷‍♂️

  |   Tollywood

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక దశలో మాస్ మహారాజా రవితేజకు లేటెస్ట్ వెర్షన్ తేజు అని కూడా కొన్నికామెంట్స్ వినిపించాయి. ఈమధ్య అంటే ఏదో ఫ్లాపులతో సతమతమవుతున్నాడు కానీ తేజు మాత్రం ఎప్పుడూ ఫుల్ జోష్ తో యాక్టివ్ గా ఉంటాడు. కానీ వాలెంటైన్ డే మరో వారంలో ఉంది కదా అది తేజూ మనసు కలతపడేలా చేస్తోందట.

ఎందుకు అని అడగరా? పాపం మెగా హీరోనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆ విషయం వెల్లడించాడు. "ఓ మై వాలెంటైను వీకు.. అప్పుడే నువ్ వచ్చావా..." అని ట్వీట్ చేస్తూ దానికి #SDTsingleChallenge అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ జత చేశాడు. ఆ ట్వీటుకు ఈ హ్యాష్ ట్యాగుకు ఒక ఫోటో కూడా పెట్టాడండోయ్. ఆ ఫోటోలో మంచి సూటు బూటు వేసుకుని అందంగా ఉన్న సాయిధరమ్ గడ్డం కింద చేయి పెట్టుకొని దిగాలుగా ఉన్నాడు. ఫోటోకు కాస్త కిందగా ఉన్న క్యాప్షన్ "1999 - సింగిల్; 2009 - మళ్లీ సింగిల్; 2019 - అయినా కానీ సింగిలే.."

కానీ నెటిజనులు నేటి జనరేషన్ జనాలు కదా.. పెద్ద పెద్ద ఛానల్స్ ఎంతో జాగ్రత్తగా చిడతలు వాయిస్తేనే వారి మాటలు అస్సలు నమ్మడం లేదు.. అలాంటిది ఎప్పుడూ ఆ హీరోయిన్ తో.. ఈ హీరోయిన్ తో తేజు మంచి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడని రూమర్లు వచ్చే తేజు 'సింగిల్' కథను ఎలా నమ్ముతారు? కొందరు నమ్మినా ఎక్కువమంది మాత్రం సెటైర్లు వేస్తూ తేజుపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఒకరు 'అత్తారింటికి దారేది' బ్రమ్మి అబద్దాలు చెప్తే ఆకులు రాలే సీన్ పోస్ట్ చేసి 'ఆకులు రాలతాయి' అంటున్నారు. తేజూ ఎప్పుడూ సింగిల్ గా ఉండడని కొన్ని రోజుల క్రితం రకుల్ చెప్పిన మాటను ఎవ్వరూ ఇంకా మర్చిపోలేదని మరికొందరు గుర్తు చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అసలు తేజు భాషలో 'సింగిల్' అంటే అర్థం 'ఒక్కరు' అనేనా.. లేక మరేదైనా ఉందా..???

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి-http://v.duta.us/BKGNSAAA

📲 Get Tollywood on Whatsapp 💬