10న తెలంగాణ కేబినెట్ విస్తరణ... కేటీఆర్, హరీశ్‌రావుకు బెర్త్‌లు డౌటే ?🤯

  |   Telugunews

ఎప్పుడెప్పుడా అని తెలంగాణ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నెల 10న ఆదివారం వసంత పంచమి రోజున కేబినెట్ విస్తరణ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని... ఇందుకు సంబంధించిన కసరత్తును కూడా ఆయన పూర్తి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పది నుంచి పదిహేను మందిని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కొందరికి కేబినెట్‌లో చోటు కల్పించాలని నిర్ణయించిన గులాబీ బాస్... కొందరు సీనియర్లను కేబినెట్ నుంచి పక్కనపెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్ రావుకు ఈ సారి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం లేదని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. కేటీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించిన గులాబీ బాస్... హరీశ్ రావుకు త్వరలోనే జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.

కేబినెట్‌లో మహిళలతో పాటు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా కసరత్తు చేసిన కేసీఆర్... కేబినెట్ కూర్పు విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ కొత్త కేబినెట్ కూర్పు ఎలా ఉంటుంది ? అనే అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/vDKwnQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬