[andhra-pradesh] - వైసీపీని షాక్‌కు గురి చేసిన అలీ తాజా వ్యాఖ్యలు
హైదరాబాద్: రాజకీయంగా పవన్, జగన్ మధ్య ఉన్న విరోధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ వ్యక్తిగత జీవితంపై కూడా జగన్ గతంలో వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయి. అలాంటి జగన్ పార్టీలోకి పవన్‌కు అత్యంత సన్నిహితుడు, పవన్ ఫొటోను పర్సులో పెట్టుకుని తిరిగే వ్యక్తి చేరాడు. ఆయనే సినీ నటుడు అలీ. అలీ వైసీపీ కండువా కప్పుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు వైసీపీని కలవరపాటుకు గురిచేశాయి. అలీ పవన్ గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు వేరు, ఫ్రెండ్షిప్ వేరు అంటూనే ఆయన సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టు ఫీలవుతానని కామెంట్ చేశారు.
అలీ చేసిన ఈ కామెంట్‌తో పక్కనే ఉన్న వైసీపీ నేతల ముఖం ఒకింత చిన్నబుచ్చుకుంది. పవన్ సక్సెస్ అయితే తాను సక్సెస్ అయినట్టే అని అలీ అనడాన్ని గమనిస్తే.. జనసేన విజయం సాధిస్తే వైసీపీలో ఉన్నప్పటికీ తానూ హర్షిస్తానన్న రీతిలో అలీ వ్యాఖ్యలున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక పార్టీలో చేరి.. ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న మరో పార్టీ అధినేత విజయాన్ని కాంక్షించడంపై వైసీపీలోని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఫోటో - http://v.duta.us/HU52EAAA
పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/Io56sAAA