టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రెమ్యున‌రేష‌న్.. అనుష్క‌, న‌య‌న‌తార టాప్..😲

  |   Tollywood

తెలుగులో స్టార్ హీరోయిన్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. రోజ‌కో కొత్త హీరోయిన్ వ‌స్తున్న ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకుని ఉండ‌టం అంటే మాట‌లు కాదు. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో స‌రిగ్గా లెక్క‌పెడితే అర‌డ‌జ‌న్ మంది స్టార్ హీరోయిన్లు కూడా లేరు. కానీ వాళ్ల రెమ్యున‌రేష‌న్స్ మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఆకాశాన్ని తాకేస్తున్నాయి.

బాలీవుడ్ హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో మ‌న ద‌గ్గ‌ర కూడా ముద్దుగుమ్మ‌లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నారు. అస‌లు తెలుగులో ఎవ‌రెవ‌రు ఎంత పారితోషికం అందుకుంటున్నారో తెలుసా..?ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ కూడా లేక‌పోయినా పూజాతో సినిమా చేయ‌డానికి స్టార్ హీరోలు ఆస‌క్తి చూపిస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హ‌ర్షితో పాటు ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తున్న పూజా.. సినిమాకు దాదాపు కోటి 70 నుంచి 2 కోట్ల వ‌ర‌కు అందుకుంటుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 ఏళ్ల‌వుతున్నా ఇప్ప‌టికీ స్టార్ ఇమేజ్ కొన‌సాగిస్తుంది. సినిమాకు కోటిన్న‌ర వ‌రకు చార్జ్ చేస్తుంది చంద‌మామ‌.ఇక త‌మ‌న్నా ఎఫ్2 విజ‌యం త‌ర్వాత సినిమాకు కోటి 20 ల‌క్ష‌లు డిమాండ్ చేస్తుంది.

కైరా అద్వానీ, రాశీ ఖ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా సినిమాకు కోటి వ‌ర‌కు తీసుకుంటున్నారు. ఇక సాయి పల్ల‌వి సైతం మొన్న ప‌డిప‌డి లేచే మ‌న‌సు సినిమా కోసం కోటి 20 ల‌క్ష‌లు పారితోషికం అందుకుంది. మొత్తానికి తెలుగులో ఇప్పుడు మ‌న హీరోయిన్లు కొంద‌రు హీరోల‌తో స‌మానంగా పారితోషికం అందుకుంటున్నారు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/Dilh1wAA

📲 Get Tollywood on Whatsapp 💬