తెరపై కొచ్చిన మహేష్ జనగణమన😎

  |   Tollywood

ఒకప్పుడు హీరోలకు అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి అంటే ఒకటి వాళ్ళను వ్యక్తిగతంగా కలుసుకోవాలి లేదా పత్రికల ద్వారానో లేదా టీవీ రూపంలో మాట్లాడేది చూడాలి. ఇప్పుడంత కష్టం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకేసారి లక్షలాది ఫ్యాన్స్ ఆకాంక్షలు ఫీడ్ బ్యాకులు ఇట్టే క్షణాల్లో తెలిసిపోతున్నాయి. నిన్న సుకుమార్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందన్న మెసేజ్ స్వయంగా మహేష్ ట్వీట్ చేశాక దానికి భారీ స్పందన దక్కింది.

శ్రీమంతుడు-భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ వాటిలో హీరో పాత్రలకు ఒక సాఫ్ట్ టచ్ ఉంటుంది. అదేమీ లేకుండా నుదుటికి కర్చీఫ్ కట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపించింది చివరిసారిగా పోకిరిలోనే. అచ్చంగా అలాంటి ఓ మసాలా సినిమా చేయమని ఈ సందర్భంగా ఫాన్స్ కోరుతున్నారు.

దానికి పూరి జగన్నాధ్ బెస్ట్ ఛాయస్ అని వాళ్ళ మనసులో మాట. బిజినెస్ మెన్ లో క్లాస్ టచ్ ఉన్నప్పటికీ అందులో కూడా మాస్ కు మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. జనగణమనతో హ్యాట్రిక్ వస్తుంది అనుకుంటే అది ఆలోచన దశలోనే ఆగిపోయింది. ఇప్పుడేదో అభుమానులు అంటున్నారని కాదు కానీ పూరి ట్రాక్ రికార్డ్ కి ఓ రెండు బ్లాక్ బస్టర్స్ పడితే కానీ మహేష్ రేంజ్ హీరోల నుంచి పిలుపు రాదు.

పూర్తి ఆర్టికల్ ఇక్కడ చూడండి -http://v.duta.us/ilu4DQAA

📲 Get Tollywood on Whatsapp 💬