[andhra-pradesh] - ఏడు... వేడి

  |   Telugunews

ఆ ఏడు స్థానాలపైనే అందరి దృష్టికోట్లలో పందేలు కాస్తున్న పందెపు రాయుళ్లుమైలవరం, తిరువూరు, మచిలీపట్నం స్థానాల్లో రాష్ట్ర మంత్రులుగుడివాడ బరిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌ఈ స్థానాలపై రెండు తెలుగురాష్ట్రాల్లోనూ ఆసక్తికరమైన చర్చగన్నవరం, విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ స్థానాలపైనా ఆసక్తి

కృష్ణా జిల్లాలోని మూడు స్థానాల నుంచి ముగ్గురు రాష్ట్ర మంత్రులు బరిలో ఉన్నారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ నేతలు బెదిరించినా అదరకుండా వల్లభనేని వంశీ గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఈ ఐదు స్థానాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీటితోపాటు విజయవాడ సెంట్రల్‌, విజయవాడ పశ్చిమ స్థానాలపైనా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై రాష్ట్రంలోనే కాక తెలంగాణలో సైతం కోట్లాది రూపాయల పందేలు కాస్తున్నారు. ఈ ఏడు స్థానాలపై ఎందుకంత ఆసక్తి నెలకొందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!

విజయవాడ (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో రెండు పార్లమెంటు, 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మైలవరం, మచిలీపట్నం, తిరువూరు నుంచి రాష్ట్ర మంత్రులు పోటీ చేస్తున్నారు. మైలవరం నుంచి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, వైసీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్‌ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనంత ఖర్చును ఇక్కడ వైసీపీ నాయకులు చేస్తున్నారు. గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ తొక్కుతున్నారు. ఏకంగా పోలీసులను సైతం ప్రలోభపెడుతూ అడ్డంగా దొరికిపోయారు. ఎలాగైనా మంత్రి దేవినేని ఉమను ఓడించాలన్న లక్ష్యంతో ఆర్థికంగా బలమైన అభ్యర్థిని వైసీపీ అధిష్ఠానం ఏరికోరి బరిలో దింపింది. అయినా ఇక్కడ టీడీపీ దూసుకుపోతోంది. పట్టిసీమతో నియోజకవర్గంలోని రైతులు సిరులు పండించుకుంటున్నారు. మరోవైపు చింతలపూడి ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇక్కడ టీడీపీ గెలుపు నల్లేరు మీద నడకగా విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్‌ అడ్డగోలు మాటలను ఖండించడంలో ముందుండే రాష్ట్ర మంత్రి బరిలో ఉండటం.. మరోవైపు గెలుపు కోసం వైసీపీ చేస్తున్న భారీ ఖర్చుతో ఈ నియోజకవర్గం పందెపురాయుళ్లకు హాట్‌సీట్‌గా మారింది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందని లక్షల్లో పందేలు జరుగుతున్నాయి. మరోవైపు దేవినేని ఉమకు ఎంత మెజారిటీ వస్తుందన్న దానిపైనా జోరుగా పందేలు సాగుతున్నాయి....

ఫోటో - http://v.duta.us/hBmV2wAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/pCav5gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬