[andhra-pradesh] - నోరు పారేసుకోకండి.. బుద్ధాపై మోహన్‌బాబు ఫైర్!

  |   Telugunews

హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు మండిపడ్డారు. ఇటీవల మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. మోహన్‌బాబును ఊసరవెల్లితో పోల్చారు. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టిన మోహన్‌బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి స్టేట్‌మెంట్‌ ఇస్తే, తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్దావెంకన్న సవాల్‌ చేశారు.

దీనిపై మోహన్‌బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ‘‘టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే.. దాని తర్వాత.. మీరు మా ఇంటికి రావాలి.. మేము మీ ఇంటికి రావాలి.. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్‌లో మీరూ విమర్శించొచ్చు.. మేము మిమల్ని విమర్శించొచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి. అన్నిటికీ ఒక హద్దు ఉంటుంది. నెల రోజుల ముందు తిరుపతికి వచ్చి మా ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడారో మర్చిపోకండి’’ అంటూ మోహన్‌బాబు ట్వీట్ చేశారు.

ఫోటో - http://v.duta.us/NncNyAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/SO2kewAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬