[andhra-pradesh] - పీవీపీకి షోకాజ్‌ నోటీసు?

  |   Telugunews

వీఎంసీ ఉద్యోగి శేఖర్‌కూ జారీవైసీపీ లోక్‌సభ అభ్యర్థి వ్యవహారంపై నాలుక్కరుచుకున్న కార్పొరేషన్‌తాత్కాలికంగా హ్యాపీ సండే రద్దు

విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ముగిసే వరకు హ్యాపీ సండేను తాత్కాలి కంగా రద్దు చేస్తూ నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. కార్యక్రమ ఇన్‌చార్జిగా వ్యవహరించిన ఎస్‌ఎఫ్‌వో శేఖర్‌కు షోకాజ్‌ నోటీసులతో సరిపుచ్చిన వీఎంసీ అదే తరహా నోటీసులను వైసీపీ అభ్యర్థి పీవీపీకి పంపబోతుంది. మార్చి 31వ తేదీ ఉదయం ఆరు గంటలకు ఇందిరాగాంధీ ముని సిపల్‌ స్టేడి యం వద్ద హ్యాపీ సండే జరిగింది. వేదికపైకి ఎక్కిన పీవీపీ తనను తాను పరిచయం చేసుకుంటూ అక్క డికి చేరుకున్న ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశా రు. వేదికపై మాట్లాడుతున్నంత సేపూ ఏ ఒక్క ఉద్యోగి ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేయ కపోవడంపై పీవీపీకి మద్దతుగా వీఎంసీ శీర్షికన ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైం ది. దీనిపై కమిషనర్‌ మట్టా రామా రావు స్పందించారు. కానీ ఎన్నికల సం ఘం తీసుకునే స్థాయిలో చర్యలు లేవ న్న విమర్శలు వీఎంసీని వేలెత్తిచూ పుతున్నాయి. రాజకీయ పార్టీలకు పరో క్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ ప్రభుత్వో ద్యోగులు సహకరించకూడదన్న ఎన్ని కల నియమావళిని పక్కన పెట్టిన వీఎంసీ ఉద్యోగులపై మాత్రం అధికా రులు శీత కన్ను వేస్తున్నారు. షోకాజ్‌ నోటీసులతో సరిపుచ్చుతూ మమ అనిపిస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో ప్రచు రితమైన కథనానికి సమాధానమి వ్వాల్సిందిగా శేఖర్‌ను కమిషనర్‌ కోర గా తాను ఈవీఎంలు తీసుకువచ్చే పనిపై మచిలీ పట్నం వెళ్లానని సమాధానమిచ్చారు. అసలు విధులను నిర్లక్ష్యం చేయకూడదన్న కనీస పరి జ్ఞానం కూడా ఆయనకు లేదన్న విషయాన్ని వీఎంసీ మరిచింది. వీఎంసీలో స్పోర్ట్స్‌, ఫైర్‌ శాఖతో పాటు వీఎంసీ సంబంధిత ఈవెంట్‌ ఆర్గనైజేషన్‌ బాధ్యతలు కూడా నిర్వహిస్తోన్న శేఖర్‌కు ఎన్నికల విధులు కూడా కేటాయించినా.. హ్యాపీ సండేకు ఇన్‌చార్జిగా మరో అధికారికి బాధ్య తలు అప్పగిం చాల్సి ఉంటుంది. కానీ ఈవెంట్లను అప్పగించడానికి ఒప్పుకోరన్న విమర్శలను ఆయన మరోసారి రుజువు చేస్తూ హ్యాపీసండేను పట్టించు కోలేదు. ఫలితంగా పీవీపీ ప్రచారానికి ఆయన పరోక్షంగా సహకరిం చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా పీవీపీ హ్యాపీ సండేకు వస్తారన్న విషయం ముందుగానే సంబంధిత అధికారులకు సమాచార ముందని తెలుస్తోంది....

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండిhttp://v.duta.us/Q56C4QAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬