[andhra-pradesh] - దూసుకొస్తున్న ‘ఫణి’

  |   Telugunews

నేటికల్లా అతి తీవ్ర తుఫానుగా బలపడే అవకాశంమే 1కి అసాధారణ తీవ్ర తుఫానుగా రూపాంతరంరేపటి నుంచి కోస్తా తీరంలో మోస్తరు వర్షాలు నౌకాశ్రయాల్లో 2వ నంబరు ప్రమాద హెచ్చరికమత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచన

విశాఖపట్నం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫణి’ తుఫాను తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాల దిశగా దూసుకొస్తోంది. ఆదివారం ఉదయం నుంచి గంటకు 15- 16కి.మీ. వేగంతో పయనిస్తోంది. సముద్రంలో తుఫాను బలపడేందుకు అనువైన వాతావరణం ఉండటంతో తీవ్ర, అతితీవ్ర స్థాయులు దాటి అసాధారణ తీవ్ర తుఫానుగా కూడా మారనుంది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఫణి... వాయవ్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి చెన్నైకి ఆగ్నేయ దిశగా 900కి.మీ., మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశగా 1,070కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్యంగా పయనించి ఆదివారం రాత్రికి తీవ్ర తుఫాను గాను, సోమవారం నాటికి అతితీవ్ర తుఫానుగా బలపడనుంది. 1న సాయంత్రం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మరింత బలపడి అసాధారణ తీవ్ర తుఫానుగా మారనుందని పేర్కొంది....

ఫోటో - http://v.duta.us/s0f7UgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/N96yoQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬