[andhra-pradesh] - నిరుద్యోగులకు ‘కోడ్‌’ కష్టాలు

  |   Telugunews

ఆ 50 వేల మందికి మోక్షమెప్పుడు?భృతి కోసం 2 నెలలుగా ఎదురుచూపులుపోలింగ్‌ ముగిసినా ఆమోదించని ఈసీభారీగా రూ.2 వేలిస్తోంది మన రాష్ట్రమేరికార్డు స్థాయిలో 4.9 లక్షల మందికి లబ్ధిఅక్రమాల చెక్‌కు జియోట్యాగింగ్‌ కూడా

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) నిరుద్యోగులతో ఆడుకుంటోంది. 50 వేల మంది నిరుద్యోగులకు సంబంధించిన భృతి దరఖాస్తులు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) వద్ద ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వచ్చిన ఈ దరఖాస్తులకు.. పోలింగ్‌ ముగిసి 17 రోజులైనా ఈసీ ఇంతవరకూ ఆమోదించలేదు. ఎప్పుడు పచ్చజెండా ఊపుతుందా అని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి కార్యక్రమం ‘ముఖ్యమంత్రి యువనేస్తం’లో భాగంగా.. ప్రతి నెలా అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి నెలా 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆయా దరఖాస్తులను పరిశీలించి ఆ తదుపరి నెలలో పాత లబ్ధిదారులతో పాటు కొత్తగా అర్హత సాధించినవారికీ భృతి ఇచ్చేస్తారు. మార్చి రెండోవారంలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నెలలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి ఇవ్వాలా.. వద్దా.. అని ఈసీ అనుమతి కోసం పంపించారు. ఏప్రిల్‌లో కూడా కొన్ని వేల దరఖాస్తులు వచ్చాయి. వీటినీ అక్కడికే పంపించారు. మొత్తంగా ఈ 2 నెలల్లో సుమారు 50వేల దరఖాస్తులొచ్చాయి. అవన్నీ కమిషన్‌ ముందు పెండింగ్‌లో ఉన్నాయి....

ఫోటో - http://v.duta.us/Ocd4hAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/qbonAgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬