[andhra-pradesh] - ప్రతిష్టంభన!

  |   Telugunews

ఎన్నికల కోడ్‌ సమయంలో స్టీరింగ్‌ కమిటీ సమావేశంనేడు నగరానికి వస్తున్న ‘శిస్ర్టా’ బృందంఏఎంఆర్‌సీ అధికారులతో సమావేశం కోడ్‌ కారణంగా స్టీరింగ్‌ కమిటీలో పాల్గొనలేని మంత్రి

లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టు విజయవాడ నగరంతో పాటు అమరావతి రాజధానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు . దీని భవితవ్యంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది! లైట్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుపై సోమవారం అత్యున్నత స్టీరింగ్‌ కమిటీ సమావేశం బెజవాడ నగరంలో జరగనుంది! సమావేశంలో కమిటీ తీసుకున్న నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుత స్టీరింగ్‌ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ కోడ్‌ కారణంగా సమావేశంలో పాల్గొనే అవకాశం లేదు. ఇదే జరిగితే అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌తో పాటు, వివిధ శాఖల ఉన్నతాధికారులే సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

విజయవాడ (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టం నిర్దేశించిన మేరకు విజయవాడ నగరానికి కేంద్రం మెట్రో రైల్‌ ప్రాజెక్టు హామీ ఇచ్చింది. విభజన చట్టంలో కూడా మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి సహాయ, సహకారాలు ఉంటాయని తెలిపింది. విభజన చట్టంలో నిర్దేశించిన ప్రాతిపదిక అయితే నూరు శాతం కేంద్ర సహాయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదా ప్రాతిపదికన అయితే 90 శాతం మేర, ప్రత్యేక ప్యాకేజీ ప్రాతిపదికన అయితే విదేశీ సంస్థల నుంచి తీసుకునే రుణం 60 శాతం ప్రాతిపదికన భరించేలా కేంద్రం తన సహాయ సహకారాలను అందించాల్సి ఉంటుంది. విజయవాడ మెట్రోకు మౌఖికంగా అనుమతులు ఇవ్వగా ప్రభుత్వం డిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) చైర్మన్‌ శ్రీధరన్‌ను సలహాదారుగా నియమించుకుంది. అదే సంస్థ నేతృత్వంలో డీపీఆర్‌ తయారు చేయించింది. ప్రాజెక్టు బాధ్యతలను కూడా అదే సంస్థకు అప్పగించింది. టెండర్లు పిలిచిన సందర్భంలో కేవలం రెండు సంస్థలు భారీ రేట్లతో బిడ్డింగ్‌ వేయటంతో సిండికేట్‌ అయ్యాయన్న ఉద్దేశ్యంతో డీఎంఆర్‌సీ టెండర్లను రద్దు చేసింది. తిరిగి మళ్లీ టెండర్లకు సంకల్పించింది. అప్పటికింకా కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు అనుమతులు రాలే దు....

ఫోటో - http://v.duta.us/ufHwAwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/gNHKmAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬