[andhra-pradesh] - మా స్కూల్లో సీట్లు లేవు!

  |   Telugunews

దయచేసి అర్థం చేసుకోండినెల్లూరులో మున్సిపల్‌ హైస్కూల్‌కు ఫుల్‌ డిమాండ్‌సరస్వతీ నిలయంగా కేఎన్‌ఆర్‌ పాఠశాలకు పేరు ప్రవేశాల కోసం ప్రజా ప్రతినిధులతో సిఫారసులుటీచర్ల అంకితభావంతో ఉత్తమ ఫలితాలుదీని దెబ్బకు చుట్టుపక్కల ప్రైవేట్‌ బడులు మూత

‘ఈ పాఠశాలలో సీట్లు లేవు’ అనే మాటను ప్రసిద్ధి పొందిన ఏ కార్పొరేట్‌ స్కూల్‌ వద్దో వింటుంటాం. ప్రవేశాల కోసం తల్లిదండ్రులు క్యూలో నిలబడటం, పిల్లల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాతే అడ్మిషన్‌ ఇవ్వడం వంటివి మెట్రోసిటీల్లోని పెద్దపెద్ద స్కూళ్ల వద్ద చూస్తుంటాం.. కానీ ఓ మున్సిపల్‌ పాఠశాలలో ఇలాంటి దృశ్యాలను నమ్మగలమా? నెల్లూరు కేఎన్‌ఆర్‌ మున్సిపల్‌ పాఠశాల విషయంలో నమ్మాల్సిందే!

నెల్లూరు, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు భక్తవత్సల నగర్‌లో ఉన్న కేఎన్‌ఆర్‌ మున్సిపల్‌ పాఠశాల ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది. కార్పొరేట్‌ బడులకు దీటుగా ఫలితాలు సాధిస్తూ, విద్యార్థుల జీవితాలకు బలమైన పునాదులు వేస్తూ సగర్వంగా తలెత్తుకునేలా చేస్తోంది. గతేడాది వరకూ ఇక్కడ సీటు కోసం ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులతో పిల్లల తల్లిదండ్రులు సిఫారసులు చేయించుకునేవారు. ఈసారి మాత్రం వేసవి సెలవుల్లోనే ‘సీట్లు లేవు.. దయచేసి తల్లిదండ్రులు అర్థం చేసుకుని, సహకరించ ప్రార్థన’ అంటూ బ్యానర్‌ పెట్టేశారు. ఇక్కడ ప్రవేశాలకు ఎంత పోటీ ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. ఏటా ఈ హైస్కూల్‌లో ఆరో తరగతిలో ఎంతమంది విద్యార్థులు చేరతారో అంతేస్థాయిలో ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతుల్లోనూ చేరేందుకు వస్తుంటారు. ఇప్పటికే ఈ తరగతుల్లో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో బ్యానర్‌ పెట్టాల్సి వచ్చిందని హెచ్‌ఎం విజయ ప్రకాశరావు చెబుతున్నారు....

ఫోటో - http://v.duta.us/39BttwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/ZM1LtAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬