[andhra-pradesh] - సౌరకాంతులు

  |   Telugunews

నగరంలోని పాత, కొత్త ప్రభుత్వాస్పత్రులకు త్వరలో సూర్యకాంతులు రాబోతున్నాయి. ప్రస్తుతం తడిసి మోపెడవుతున్న విద్యుత్తు బిల్లులను చెల్లించలేక విలవిల్లాడుతున్న సర్కారు దవాఖానాలకు సగానికి సగం బిల్లులు ఆదా కానున్నాయి. ఆసుపత్రులకు సూర్యకాంతులేమిటి? కరెంటు బిల్లులు తగ్గడమేంటనేగా మీ సందేహం. సహజ వనరులను వినియోగించుకొని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంతోపాటు ప్రజారోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఎక్కడికక్కడ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో కరెంటు బిల్లులను తగ్గించే లక్ష్యంతో ఈ సోలార్‌ పవర్‌ ప్లాంట్లను సిద్ధం చేస్తోంది. వీటిలో విద్యుత్‌ సమస్యలకు చెక్‌ పెట్టడంతోపాటు నెలవారీ బిల్లులను గణనీయంగా తగ్గించేందుకు ఆయా ఆస్పత్రులపై సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. విజయవాడ పాత, కొత్త ప్రభుత్వాస్పత్రులతోపాటు ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, ప్రభుత్వ దంత వైద్యశాల, కళాశాలలపై సోలార్‌ పవర్‌ ప్లాంట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వ ఆసుపత్రి భవనాలపై సోలార్‌ ప్యానల్స్‌ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి....

ఫోటో - http://v.duta.us/UeSiXwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/yP2YRgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬