నేడు ఉప ముఖ్యమంత్రి బోస్ జిల్లాకు రాక…

  |   Telugunews

మండపేట :-రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం జిల్లాకు రానున్నారు. ఉపముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తొలి సారి ఆయన జిల్లా లో పర్యటించనున్నారు. దీంతో వైకాపా నాయకులు ,పార్టీ శ్రేణులు ఆయనకు భారీ స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. అమరావతిలో సోమవారం మధ్యాహ్నం మంత్రి వర్గం భేటి అనంతరం మధ్యాన్నం 1 గంటకు బయలు దేరుతారు.గోపాలపురం వద్ద జిల్లా లో అడుగిడుతారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగిరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ఘన స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తున్నారు.అక్కడ దివంగత నేత చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం జగ్గిరెడ్డి స్వగృహనికి చేరుకుంటారు.అక్కడ నుండి భారీ ఊరేగింపు గా రావులపాలెం, అలమురు, గుమ్మిలేరు మీదుగా మండపేట చేరుకుంటారు.సాయంత్రం 4 గంటలకు మండపేట బైపాస్ టోల్ గెట్ వద్ద వైకాపా రాష్ట్ర కార్యదర్శి కర్రీ పాపరాయుడు, వైకాపా నాయకులు వేగుళ్ళ పట్టాభి రామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, దులం వెంకన్న బాబు,పడాల సతీష్ ల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతూ ఊరేగింపు నిర్వహిస్తారు.మెయిన్ రోడ్ నుండి పెద్ద కల్వ వరకు ర్యాలీ నిర్వహిస్తారు.పసలపూడి వద్ద రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో స్వాగతం పలుకుతారు.సాయంత్రం 5 గంటల కు రామచంద్రపురం వి ఎస్ ఎం కళాశాల ఆవరణలో ఉన్న దివంగత ఉండవల్లి సత్యనారాయణ మూర్తి విగ్రహం కు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. మెయిన్ రోడ్ మీదుగా ద్రాక్షరామ్ చేరుకుంటారు.రాత్రి 7 గంటలకు ఉపముఖ్యమంత్రి స్వగ్రామం హాసన బాదా చేరుకుంటారు.

ఫోటో - http://v.duta.us/rXfN5QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/OJ1_awAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬