బెల్టు తీస్తాం…మద్యం అమ్మకాలపై నిఘా…

  |   Telugunews

మండపేట :-బెల్టు షాపుల నిర్వహణపై చట్టపరమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని, నిందితులు జైలుపాలు కాకతప్పదని ఆలమూరు ప్రోహిభిషన్, ఎక్సైజ్ సిఐ డి.సుధ అన్నారు.మండపేట లో సోమవారం ఆమె మాట్లాడుతూ నాటుసారా, బెల్టులను పూర్తిగా నిర్మూలించడంలో అధికారులతోపాటు ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలన్నారు.గ్రామలలోని మహిళలు, విద్యార్థులు, పొదుపు మహిళలకు బెల్టుపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రభుత్వం నాటుసారా, బెల్టులను నిర్మూలించేందుకు కృతనిశ్చయంతో ఉందన్నారు. బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసినవారిని గుర్తించి స్థానిక తహసీల్దారుకు బైండోవర్‌ చేస్తామన్నారు. అలాగే నిందితులకు రూ50వేల నుంచి లక్ష రూపాయల వరకు అపరాధ రుసుంతోపాటు జైలుకుపంపే అవకాశం ఉంటుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా తీసుకున్న బెల్టుషాపుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆలమూరు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మండపేట మండలంలో 2014 జూన్ నెల నుండి ఇప్పటి వరకు 65 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.62 మందిని అరెస్టు చేసామన్నారు. 146.5 లీటర్ల మధ్యం, 1.96 లీటర్ల బీరు, 5 వాహనలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఆలమూరు మేజిస్ట్రేట్ 38 కేసుల్లో రూ.7600/-లు అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు.ఆలాగే బెల్టుషాపులకు మధ్యం సరఫరా చేసిన రెండు మధ్యం షాపులకు ఒక్కో షాపునకురూ లక్ష చొప్పన రెండు మధ్యం షాపులకు రెండు లక్షల జరిమానా ఆబ్కారీ కమీషనర్ విధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా నిభందనలు అతిక్రమించి బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలాగే బెల్టు షాపుల సమాచారాన్ని అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆలమూరు ప్రోహిభిషన్ ఎక్సైజ్ సి.ఐ డి.సుధ తెలిపారు. సమాచారం నేరుగా తన 9440902412 నెంబరుకు తెలియచేయవలసినదిగా కోరారు.

ఫోటో - http://v.duta.us/-BmJDQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/IetzGwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬