విజయవాడ తరలిన వెళ్ళిన భవన నిర్మాణ కార్మికులు,సిపిఐ నాయకులు

  |   Telugunews

సంతమాగులూరు, : భవన నిర్మాణ కార్మికులకు 1996 సంక్షేమ చట్టం ద్వారా ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2009 నుండి బిల్డింగ్‌ అండ్‌ కన్‌ష్ట్రక్షన్‌ వర్కర్స్‌ సంక్షేమ బోర్డు ద్వారా అనాటి ప్రభుత్వం 14 రకాల సౌకర్యాలు ఇవ్వాలనే సదుద్దేశంతో ప్రారంబించిందని, తదుపరి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సంక్షేమ బోర్డుకు తూట్లుపొడిచి బోర్డు నుండి వందలాది కోట్ల రూపాయలు పక్కదారి మళ్ళించి భవన నిర్మాణ కార్మికులకు నష్టం కలిగించాలడిని మండల భవన నిర్మాణ అధ్యక్షులు గుంజి బుల్లిబాబు అన్నారు. ఈ క్రమంలోనే భవన నిర్మాణ సమస్యలు పరిష్కారం కొరకు ఈ నెల 10 సోమవారం విజయవాడలో జరిగే ధర్నా కార్యక్రమానికి మండలంలోని భవన నిర్మాణ కార్మికులు తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో మండల భవన నిర్మాణ అధ్యక్షులు గుంజి బులిబాబు, కార్యదర్శి నక్కా ఆంజనేయులు, సభ్యులు కోటేశ్వరరావు, రమణయ్య,కుమార్‌ పోలయ్య, జిలాని ,అక్బరు, కొండయ్య, శ్రీను ,శ్యాంసన్‌ తదితరులు ధర్నా కార్యక్రమానికి తరలి వెళ్ళారు.

ఫోటో - http://v.duta.us/ZIwPNAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/S1w-LQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬