14న సాప్ట్ వేర్ , డెటా ఎనాలిసిస్ శిక్షణకు ఎంపిక

  |   Telugunews

శ్రీకాకుళం, : జిల్లా గ్రామీణాభివృద్థి సంస్థ – సీడాప్ ద్వారా నవగురుకులు నందు సాప్ట్ వేర్ ఇంజనీరింగ్ మరియు డెటా ఎనాలిసిస్ శిక్షణ కొరకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఆర్ డిఎ పథక సంచాలకులు ఎ.కళ్యాణ చక్రవర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎచ్చెర్ల లోని తాహశీల్దార్ కార్యలయం ప్రక్కన ఉన్న టిటిడిసిలో ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు అన్ లైన్ పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ పరీక్షకు 18 సం, నుండి 23వ సం, వయస్సుకలిగి, 10వ తరగతి, ఇంటర్ , డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ పరీక్షను ఆన్ లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తామని, ఎంపికైన అభ్యర్థులలో బాలికలకు బెంగుళూరులోను, బాలురకు హిమాచల ప్రదేశలోను ఒక సంవత్సరం కాలం పాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు ల్యాప్ టాప్, ఉచిత భోజన, వసతి కల్పించబడునని అన్నారు. శిక్షణా అనంతరం నెలకు రూ.20,000/- వేతనంతో ఉద్యోగం కల్పించబడునని ఆ ప్రకటనలో తెలిపారు. ఆన్ లైన్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా , రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు విద్యార్హత సర్టిఫికెట్ జిరాక్సులు, రెండు పాస్ ఫొటోలు సమర్పించవలసినదిగా ఆప్రకటనలో తెలిపారు.

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/FLDVgAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬