అమరావతి : ఏపీలో 21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ

  |   Telugunews

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డీజీగా అనురాధ, జీఏడీ ఎస్‌.బాలసుబ్రహ్మణ్యం, పోలీస్‌ వెల్ఫేర్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఏడీజీగా ఎన్‌.శ్రీధర్‌రావు, విశాఖ పోలీస్‌ కమిషనర్‌గా ఆర్కే మీనా, పోలీస్‌ పర్సనల్‌ ఐజీగా మహేష్‌ చంద్ర లడ్డా, పీటీవో ఐజీగా కె.సత్యనారాయణ, ఏపీఎస్పీ ఐజీగా బి.శ్రీనివాసులు, గుంటూరు రేంజ్‌ ఐజీగా వినీత్‌ బ్రిజ్‌లాల్‌, పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ ఘట్టమనేని శ్రీనివాస్‌, ఇంటెలిజెన్స్‌ (ఎస్‌ఐజీ) డీఐజీగా సీహెచ్‌ శ్రీకాంత్‌, టెక్నికల్‌ సర్వీసెస్‌ డీఐజీగా జి.పాల్‌రాజ్‌, విశాఖ రేంజ్‌ డీఐజీగా ఎన్‌కేవీ రంగారావు, అడ్మినిస్ట్రేషన్‌ అసిస్టెంట్‌ ఐజీగా ఎన్‌.హరికృష్ణ, ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా కేవీ మోహన్‌రావు, సీఐడీ ఎస్పీగా జీవీజీ అశోక్‌కుమార్‌, అనంతపురం ఏపీఎస్పీ బెటాలియన్‌ కమాండెంట్గా సర్వశ్రేష్ట త్రిపాఠి, పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌ – కోయ ప్రవీణ్‌, గుంతకల్లు రైల్వే ఎస్పీగా విక్రాంగ్‌ పాటిల్‌, విశాఖ శాంతిభద్రతల డీసీపీగా ఎన్‌.రంగారావు, విజయవాడ రైల్వే ఎస్పీగా కె.నారాయణ నాయక్‌, కర్నూలు ఏఎస్పీగా ఎం.దీపిక లను నియమించారు.

ఫోటో - http://v.duta.us/zMylewAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/eAa8xAEA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬