ఆర్టిస్టులకు ‘డబుల్ బెడ్‌రూం’ ఇళ్లు: ‘మా’ అధ్యక్షుడు నరేష్

  |   Tollywood

సుమారు మూడు నెలల క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఎన్నికైన నూతన పాలకవర్గం తొలిసారి అధికారికంగా సమావేశమైంది. ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ‘మా’ అధ్యక్షుడు నరేష్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఓడిన శివాజీ రాజా వర్గం కూడా ఈ మీటింగ్‌లో పాల్గొంది. సమావేశం అనంతరం అధ్యక్షుడు నరేష్ మీడియాతో మాట్లాడారు. ‘మా’ జనరల్ బాడీ మీటింగ్ స్నేహపూర్వకంగా, కోలాహలంగా, విజయవంతంగా సాగిందని నరేష్ చెప్పారు.

‘మొదటి జనరల్‌ బాడీ మీటింగ్‌ చాలా బాగా జరిగింది. ‘మా’కి గతంలో ఏఎన్నార్‌, ఆ తర్వాత కృష్ణ, చిరంజీవి ముఖ్య సహాదారులుగా ఉన్నారు. ఈసారి కృష్ణంరాజు గారిని ఎన్నుకున్నాం. ఈ సందర్భంగా వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. కొత్త కమిటీ వచ్చిన వారం రోజుల్లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశాం. 30 కాల్స్‌ వచ్చాయి. సలహాల‌ బాక్స్‌కి మంచి స్పందన వచ్చింది. 33 మందికి ఇచ్చే పెన్షన్‌‌ను రూ.6 వేల‌కు చేశాం. మేడే రోజున‌ పెన్షన్‌ డేగా జరుపుకోబోతున్నాం’ అని నరేష్ వెల్లడించారు....

ఫోటో - http://v.duta.us/QQ8n6AAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/VoI_5gAA

📲 Get Tollywood on Whatsapp 💬