క్రియేటివ్ డైరెక్టర్‌తో నితిన్ కొత్త సినిమా.. ఇద్దరు భామలతో రొమాన్స్

  |   Tollywood

హీరో నితిన్ మరో సినిమాను పట్టాలెక్కించారు. వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తున్నారు. ఇది నితిన్‌కు 28వ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. పూజా కార్యక్రమంలో హీరో నితిన్, హీరోయిన్ ప్రియా వారియర్, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, నిర్మాత ఆనంద్ ప్రసాద్ పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి క్లాప్‌నిచ్చారు.

చంద్రశేఖర్ ఏలేటితో సినిమా చేస్తుండటం పట్ల నితిన్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సినిమా ప్రారంభమైందని ట్వీట్ చేశారు. ‘నితిన్ 28 ముహూర్తం అయిపోయింది. ఏలేటి చంద్రశేఖర్ గారితో పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా ప్రత్యేకంగా ఉంటుంది!! మొత్తం మీద రకుల్‌ నేను కలిసి పనిచేస్తున్నాం. ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్‌గా చేస్తోంది. భవ్య ఆనంద్ ప్రసాద్ గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీరవాణి గారు సంగీతం అందిస్తున్నారు’ అని తన ట్వీట్‌లో నితిన్ పేర్కొన్నారు....

ఫోటో - http://v.duta.us/TlGEiwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/ymfKfwAA

📲 Get Tollywood on Whatsapp 💬