చినకాపు సేవలు చిరస్మరణీయం..

  |   Telugunews

మండపేట : దివంగత మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి (చినకాపు) రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు జిన్నూరి సత్యసాయిబాబా అన్నారు. ఆదివారం ఆయన వర్థంతి సందర్భంగా కాపు సంఘం ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా నిర్వహించారు. జొన్నల శేషయమ్మ అబ్బులు కాపు కళ్యాణ మండపంలో చిన కాపు చిత్రపటానికి సాయిబాబా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన తో పాటు సంఘ సభ్యులు కూడా నివాళులు అర్పించారు. అనంతరం మండపం వద్ద ఉన్న చిన కాపు విగ్రహానికి, బస్ స్టాండ్ జంక్షన్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ మంత్రిగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది అన్నారు. సామాజిక పరంగా సంఘ అభ్యున్నతికి కోసం పడిన పాటు తాము ఎప్పటికీ మర్చిపోలేమని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామన్నారు. హై కోర్టు లాయర్ , సీనియర్ జర్నలిస్ట్ గోవందరాజు చినకాపు రాజకీయ చరిత్రను వివరించారు. కార్యక్రమం లో మాజీ కాపు సంఘం అధ్యక్షుడు సత్తి ముసలయ్య, సంఘ పెద్దలు సిద్దిరెడ్డి సూర్యారావు, కొప్పిరెడ్డి కృష్ణ, మెండు బాపిరాజు, సిద్దిరెడ్డి రామకృష్ణ, కంఠం శెట్టి సత్తిబాబు, శెట్టి నాగేశ్వరరావు, ప్రగడ సూరిబాబు, నాయకులు ఉల్లింకల రామకృష్ణ, మత్సా నాగు, కోళ్ల శ్రీను, అధికారి శ్రీను, సీతిని సూరిబాబు, సాధనాల చక్రపాణి, పులగం శ్రీనివాస్, సాధనాల శివ, ఈలి తాతాజీ, నాగవరపు శ్రీను ,వంగా సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/SUS4UAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/yMHkXwAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬