‘నాన్న నువ్వు నాకు అమ్మయినావా’.. చిత్ర స్వరం నుంచి జాలువారిన మరో ఆణిముత్యం

  |   Tollywood

సీనియర్ గాయని చిత్ర గురించి పరిచయం అక్కర్లేదు. పి.సుశీల, ఎస్.జానకి తరవాత అంత గుర్తింపు తెచ్చుకున్న గొప్ప గాయని చిత్ర. తన మధురమైన స్వరం నుంచి జాలువారిన ఎన్నో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ‘దక్షిణ భారత నైటింగేల్’ అని బిరుదు అందుకున్న చిత్ర.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ భాషల్లో కలుపుకుని కొన్ని వేల పాటలు పాడారు. వాటిలో కొన్ని పాటలు ఎప్పటికీ ఆణిముత్యాలే. అలాంటి పాట ఒకటి తాజాగా చిత్ర ఆలపించారు.

నవీన్ నాయిని దర్శకత్వంలో ‘ఉండిపోరాదే’ అనే సినిమా ఒకటి తెరకెక్కుతోంది. తండ్రీ కూతుళ్ల మధ్య బంధాన్ని తెలిపే చిత్రమిది. గోల్డ్‌టైమ్ ఇన్ పిక్చర్స్ బ్యానర్‌పై డాక్టర్ లింగేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ తేజ్, లావణ్య, కేదార్ శంకర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ‘నాన్న నువ్వు నాకు అమ్మయినావా’ అనే పాటను ఆదివారం విడుదల చేశారు. సాబు వర్గీస్ స్వరపరిచిన ఈ పాటను చిత్ర ఆలపించారు. శుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికే అర్థమయ్యేలా చాలా సులభమైన పదాలను ఈ పాటలో అశోక్ తేజ రచించారు....

ఫోటో - http://v.duta.us/5hyQVwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/6ScLXQAA

📲 Get Tollywood on Whatsapp 💬