శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

  |   Telugunews

తుని : స్వాతంత్ర సమరయోధుడు, దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన జన సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 66 వ వర్ధంతి ఆదివారం తుని లో బీజేపీ శ్రేణులు నిర్వహించారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి బిజెపి నాయకుడు వెలగా ఈశ్వరరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బిజెపి నేతలు మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియాడారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారని, కాలక్రమంలో అది భారతీయ జనతా పార్టీగా మారిందని వివరించారు. భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారు.. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక జెండా, రాజ్యాంగం, ప్రధానమంత్రి ఉండటాన్ని ప్రశ్నించారు.. ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండరాదని గట్టిగా నినదించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని వక్తలు కొనియాడారు. కాశ్మీర్ కోసం ప్రాణ త్యాగం చేసిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని, ఆర్టికల్ 370 ని పూర్తిగా రద్దు చేసిన నాడే ఆయనకు నిజమైన నివాళి అర్పించి నట్లు అవుతుంది అన్నారు. ఇందు కోసం పోడాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పుల్లంరాజు, రంగబాబు, కుమార్, శివమణి, పోలరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/VkUI5QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/S8i0aQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬