Warangal Rape: బిగ్‌బాస్ కౌశల్ షాకింగ్ నిర్ణయం.. ఆమరణ నిరాహారదీక్ష

  |   Tollywood

తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి ఒడిగట్టి పొట్టనపెట్టుకున్న ప్రవీణ్‌ను కఠినంగా శిక్షించాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి. మానవ మృగంలా మారిన కిరాతకుడి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి శ్రీహితకు న్యాయం జరగాలని ఆ పసి పాపని చూసి రోదించని గుండె లేదు.. ఆ రాక్షసుడ్ని చంపేయాలని రగలని హృదయం లేదు.

తెలంగాణ హన్మకొండలో జరిగిన ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విప్లవం మొదలైంది. జస్టిస్ ఫర్ శ్రీహిత అంటూ నెటిజన్లు నినదిస్తున్నారు. సామాన్య జనంతో పాటు సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా శ్రీహితకు న్యాయం జరగాలని ఆ రాక్షసుడ్ని శిక్షించాలని కోరుతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ శ్రీహితకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

హన్మకొండలో 9 నెలల చిన్నారి శ్రీహితకు అన్యాయం జరిగి రెండు రోజులైనా ఆమెకు సరైన న్యాయం జరగనందున న్యాయం పోరాటం చేస్తున్నానన్నారు కౌశల్. పోలీసుల నుండి కాని ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో ఆమరణ దీక్ష చేయబోతున్నానన్నారు కౌశల్. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన ఆమరణ నిరాహారదీక్షకు సంబంధించిన వివరాలను తెలియజేశారు....

ఫోటో - http://v.duta.us/1ffH6gAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/RDsTZgAA

📲 Get Tollywood on Whatsapp 💬