జగన్ కేసులో ఈడీ తీరును తప్పుబట్టిన అప్పిలేట్ ట్రిబ్యునల్

  |   Telugunews

అమరావతి : వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు తీరును అప్పిలేట్ ట్రిబ్యునల్ తప్పుబట్టింది. పెన్నా సిమెంట్స్ ఆస్తుల అటాచ్ మెంట్ కేసులో ఈడీకి అక్షింతలు వేసింది. పెన్నాకు భూముల కేటాయింపులో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. బలవంతంగా భూములు తీసుకున్నారని ఒక్క రైతైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించిన ఈడీని ట్రిబ్యునల్ ప్రశ్నించింది. 7.5 కోట్ల లబ్ది పొందడానికి 53 కోట్లు ఇచ్చారని అనడం నమ్మశక్యంగా లేదని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. అవి ముడుపులో.. పెట్టుబడులో నిర్దారించే ఒక్క ఆధారమైనా ఉందా అని ప్రశ్నించింది. కేవలం ఆరోపణలపై ఆస్తులు అటాచ్ చేయవద్దని ఈడీకి చెప్పిన ట్రిబ్యునల్, స్వతంత్ర సంస్థ అని చెప్పుకునే ఈడీ.. స్వతంత్రంగా ఆధారాలు సేకరించాలని చెప్పింది. పెన్నా సిమెంట్స్ భూములను స్వాధీనం చేసుకోవద్దని ఈడీకి ఆదేశాలిచ్చింది. ఫిక్స్ డ్ డిపాజిట్ తీసుకొని పయనీర్ హోటల్ ను జప్తు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది.

ఫోటో - http://v.duta.us/t3R-uAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/hreT8gAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬