‘తెలుగు నాకంటే బాగా మాట్లాడుతున్నాడు’.. విదేశీయుడికి మంచులక్ష్మి ఫిదా

  |   Tollywood

డైలాగ్ కింగ్ మోహన్‌బాబు వారసురాలిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి నటిగా మంచిపేరు తెచ్చుకున్నా భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. ఆమె ఎక్కడ మాట్లాడినా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. అయితే లక్ష్మి అవేమీ పట్టించుకోకుండా తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటారు.

అసలు విషయానికొస్తే.. ఇటీవల అమెరికాలో ఇస్సాక్ రిచర్డ్ అనే అమెరికన్ తెలుగు బాగా మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మనవాళ్లేమో ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే అతడేమో తెలుగులో మాట్లాడండి అంటూ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై తాజాగా రిచర్డ్ స్పందిస్తూ ఓ వీడియో పోస్టు చేశాడు. ‘ అందరూ నన్ను న్యూజిలాండ్ వ్యక్తినని అనుకుంటున్నారు, కానీ నేను అమెరికనన్‌ని. 2016-18 మధ్య రెండేళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారు. ఏడాది వైజాగ్‌లో, మరో ఏడాది విజయవాడలో నివసించాను. అప్పుడే తెలుగు నేర్చుకున్నాను. అమెరికాలో ఓ ఐస్‌క్రీమ్ పార్లర్లో పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చే తెలుగు టూరిస్టులతో నేను తెలుగులోనూ మాట్లాడతా. ఓ రోజు తెలుగులో మాట్లాడుతుంటే అమ్మాయి వీడియో తీసింది. నేను తెలుగు మాట్లాడటం గొప్ప విషయమా?. నా వీడియో ఎందుకు తీస్తున్నారని మొదట అనుకున్నాను. కానీ దానికి వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాను. నాకు తెలుగంటే చాలా ఇష్టం. నా గుండె ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో నా అనుభవాలను నా ఫేస్‌బుక్ ఫేజ్ ద్వారా మీతో పంచుకుంటాను’ అని ఇసాక్ రిచర్డ్ అన్నారు....

ఫోటో - http://v.duta.us/FlVyAwEA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/A3ZkjwAA

📲 Get Tollywood on Whatsapp 💬