‘దర్బార్’ ఖాకీ లుక్ లీక్.. తలైవా కిర్రాక్!

  |   Tollywood

సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న చిత్రం ‘దర్బార్’. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సెట్ నుంచి రజినీ ఫొటో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పోలీస్ యూనిఫాంలో స్టైల్‌గా నడుస్తూ సెల్యూట్ చేస్తోన్న రజినీని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ ఒక్కటి చాలు అంటూ తెగ మురిసిపోతున్నారు. కాగా, ఈ షెడ్యూల్ ఆగస్టులో ముగుస్తుందని అంటున్నారు.

కాగా, ‘దర్బార్’లో రజినీకాంత్ రెండు పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఐపీఎస్ అధికారిగా, సామాజిక కార్యకర్తగా రెండు విభిన్న పాత్రల్లో రజినీ నటిస్తున్నారని సమాచారం. రజినీకాంత్ చాలాకాలం తరవాత పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో ‘మూండ్రు ముగమ్’, ‘పాండియన్’, ‘కోడి పరకుత్తు’ సినిమాల్లో రజినీ పోలీస్‌గా కనిపించారు. ‘దర్బార్’లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమె గతంలో ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’, ‘శివాజీ’ చిత్రాల్లో రజినీ సరసన నటించారు....

ఫోటో - http://v.duta.us/CDnLugAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/z5gWfAAA

📲 Get Tollywood on Whatsapp 💬