బాలుడి ఆచూకీ కోసం… పోలీసుల విశ్వ‌యత్నం…

  |   Telugunews

మండపేట : మండపేట లో సోమవారం కిడ్నాప్ కు గురైన చిన్నారి నూక జషిత్ (4)ఆచూకీ కోసం పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా జిల్లా ఎస్ పి అద్నాన్ నయిమ్ హష్మి మండపేట చేరుకుని టౌన్ పోలిస్ స్టేషన్ వద్ద కేసుకు సంధించిన అన్ని అంశాలు పర్యవేక్షించారు. కొత్తగా నియమితులైన రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి భాద్యతలు స్వీకరించి ఈ కేసు పూర్వపరాలు సేకరించారు. ఎస్పీ స్టేషన్ వద్ద ఉండటం తో అక్కడ హడావిడి చోటుచేసుకుంది.మొత్తం టీము లన్నింటి కి ఎప్పటికప్పుడు ఎస్పీ ఆదేశాలు ఇస్తూ…చిక్కుముడి విప్పే పనిలో పడ్డారు. పోలీస్ ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం హోమ్ శాఖ కు అందిస్తున్నారు. మరో వైపు ఇంటిలిజెన్స్, ఎస్ బి శాఖలు రంగంలోకి దిగారు. ఎలాగైనా బాలుడి ఆచూకీ కనిపెట్టాలన్న ధ్యేయంగా పోలీసులు శ్రమిస్తున్నారు. రూరల్ సి ఐ మంగాదేవి, ఎస్ ఐ లు రాజేష్ కుమార్, దొరరాజు లు బృందాలు గా విడి పోయి కిడ్నాప్ చేసిన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఫోటో - http://v.duta.us/vF_HjgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/ArfbnQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬