అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు

  |   Telugunews

శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి మొట్టమొదటి సమావేశం స్థానిక వినాయక సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు నగరంలో విగ్రహాలను నెలకొల్పే వివిధ కమిటీల కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. గణేష్ మహోత్సవ కేంద్ర సమితి జిల్లా గౌరవాధ్యక్షులు కే. కపిలేశ్వరయ్య మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు ,అత్యంత వైభవోపేతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 2వ తేదీన గణేష్ మహోత్సవాలు ప్రారంభమై సెప్టెంబర్ 10వ తేదీన నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక గణేష మండపాల నిర్వాహకులు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అన్నారు. కర్నూల్ నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదక్షుడు కృష్ణ మాట్లాడుతూ సరిగ్గా 15 రోజుల క్రితం కేసి కెనాల్లో చుక్క నీరు కూడా లేదని తాము అత్యంత దీక్షతో ” మహా వరుణ యాగాన్ని ” నిర్వహించామని, దాని వల్లే స్థానికంగా వర్షాలు కురవక పోయినా ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షం కురిసి కేసీ కెనాల్ నిండుగా ప్రవహిస్తుందని అన్నారు. సమితి జిల్లా కార్యాధ్యక్షలు బాలిశెట్టి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ గణేషమహోత్సవ కేంద్ర సమితి ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో గణేశమహోత్సవ సమితులను ఏర్పాటు చేసి అక్కడకూడా క్రమపద్దతిలో నియమితంగా కార్యక్రమాలు, నిమజ్జనోత్సవాలు జరిగేలా కృషిచేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి రంగస్వామి, సందడి సుధాకర్,జోగయ్య, గూడా సుబ్రహ్మణ్యం, తుంగారమేష్, రఘునందన్, మాళిగి భానుప్రకాష్. మరియూ మంటపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/aR-xfwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/NmIL4wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬