ఉజ్వల భవిష్యత్తుకి మార్గదర్శి అవ్వాలి

  |   Telugunews

శ్రీకాకుళం : విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యులు, అధ్యాపకులు మార్గదర్శిగా నిలవాలని స్థానిక సిఐ ఆర్.రవిప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని మండల పరిషత్ కార్యాలయములో ప్రభుత్వ, ప్రవేట్ కళాశాల అధ్యాపకులు, ప్రినిసిపాల్, వసతి గృహాల యాజమాన్యాలతో అవహగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల నైపుణ్యత సాదించడములో అధ్యాపకుల శ్రద్ద కనబర్చి వారి నడవడికలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడములో ముఖ్య పాత్రవహించాలన్నారు. వారు చిన్ననాటి నుండే తల్లిదండ్రుల తరువాత ఉపాధ్యులతో ఎక్కువ సమయం గడపడం వలన వారు ఉన్నత ఆశయాలకి కృషి చేయవలసిన బాధ్యతన్నారు. ముఖ్యానంగా 9,10, ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలల విద్యార్థులు, వసతి గృహాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి శ్రద్ద వహించాలన్నారు. ఆ దశలోనే తెలిసి తెలియని ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్తు అంధకారంలోకి మసకబారుతుందని అందుకు యాజమాన్యాలు ఆయా విద్యార్థులు తమ పిల్లలాగా భావించి వారి వ్యవహాశైలిపై దృష్టిసారించి సరైన మార్గంలో నడిపించి ఉన్నత ఆశయాలకు ప్రేరణగా నిలవాలన్నారు.ఈసదస్సులో ఎస్ఐ రాజేష్, విద్యాశాఖాధికారి బొబ్బిలి సింహాచలం,మహీంద్రా డిగ్రీ ప్రిన్సిపాల్ ఆచార్య ,ఆంధ్రప్రదేశ్ సైకాలిజిస్టు కార్యనిర్వాక కార్యదర్శి డైరెక్టర్ గోకవలస రాజు, పాతపట్నం పాఠశాల యాజమయ్మ శంకర్ రావు పెద్దింటి శ్రీనివాస్ రావు, రవి,శ్రీధర్ పట్నాయక్ ,ఎం.సోమేశ్వర్ రావు తదితరులు సూచనలు సలహాలు అందించారు.

ఫోటో - http://v.duta.us/VaZD-QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/HS188wAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬