కొత్త ఆలోచనలతో ఎస్.బి.ఐ ముందడుగు

  |   Telugunews

తుని : కొత్త ఆలోచనలతో ఎస్ బి ఐ ముందడుగు వేసింది. మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, డి ఎఫ్ ఎస్ ఆదేశాల మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ రెండు రోజుల పాటు తుని ప్రాంతీయ కార్యాలయంలో ఎస్ బి ఐ బ్రాంచ్ మేనేజర్లకు, ఆఫీసులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్ బి ఐ జనరల్ మేనేజర్ భాస్కర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ గిరిధర్ జాతీయ ప్రాధాన్యతలకు అనుగుణంగా బ్యాంకు పని తీరు పై సిబ్బందితో సమగ్రంగా చర్చించారు. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రజలకు మరింత చేరువ కావాలనే సంకల్పంతో అధికారులు పనిచేయాలని సూచించారు. వివిధ రంగాలకు రుణాల మొత్తాన్ని పెంచడం, సీనియర్ సిటిజన్లు , రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, విద్యార్థులు , యువకుల ఆకాంక్షలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను తీర్చిదిద్దడం పై సమగ్రంగా చర్చించారు. వ్యవసాయ రుణాలు, గృహ రుణాలు, చిన్నతరహా రుణాలు, స్వయం సేవక్ సంఘ్ రుణాలు సులభతరం చేయాలని, రుణాల రికవరీ కు సంబంధించి స్థానిక ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకోవాలని, ప్రభుత్వ రాయితీలు గ్రామాల్లో అర్హులైన వారికి బ్యాంకు ద్వారా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని, డిజిటల్ సేవలు మారుమూల ప్రాంతాలకు సైతం అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని బ్యాంకు మేనేజర్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఫోటో - http://v.duta.us/v_LvNQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/UEhwvgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬