పవన్ పుట్టిన రోజున వేలాది మొక్కలు నాటుతాం

  |   Telugunews

అంబాజీపేట : జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సెప్టెంబర్ 2న నిర్వహించనున్న నేపథ్యంలో ఈసారి పుట్టినరోజును వినూత్నంగా నిర్వహిస్తున్నట్లు అంబాజీపేట జన సైనికులు తెలిపారు. సాధారణంగా రాజకీయ నాయకుల, సినీ హీరోల పేర్లతో జన్మదినోత్సవాలు జరుపుతూ ఎంతో హంగు ఆర్భాటాలు చేయడం, మోటార్ సైకిల్ సైలెన్సర్ లు తీసివేసి నానా హంగామా చేయడం, ధ్వని, వాయు కాలుష్యం కల్పించడం జరుగుతోందని ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ఎటువంటి హంగు ఆర్భాటాలు చేయకుండా కోనసీమ వ్యాప్తంగా వేలాది మొక్కలు నాటుతామని జనసైనికులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొర్లపాటి వారి పాలెం లో ఉన్న కాపు సామాజిక భవనం లో జనసైనికులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసైనికుడు సిరిగినీడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ… రోజురోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోందని దీన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ రెండో తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఏ ఒక్క జనసైనికుడు ఎటువంటి హంగామా సృష్టించవద్దని, ఇందుకు భిన్నంగా వేలాది మొక్కలను కోనసీమ వ్యాప్తంగా నాటుదామని, ప్రజల్లో చైతన్యం తీసుకు వద్దామని సూచించారు .ఇందుకు ప్రతి ఒక్క జన సైనికుడు అంగీకరించారు. అంతేకాకుండా జనసేన కేంద్ర కార్యాలయం నిర్మించడం కోసం పార్టీ ఫండ్ కోసం ప్రతి ఒక్క జనసైనికుడు ఆర్థిక సాయం చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో జనసైనికులు అరిగెల సూరిబాబు, దొమ్మేటి సాయికృష్ణ, సుంకర బాలాజీ, ములపర్తి రమేష్, కొర్లపాటి వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఎం.ఆదిబాబు, కె. విజయ్, దొమ్మేటి వినోద్ కుమార్, మేడిది శ్రీను, పత్తి దత్తుడు, పితాని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/mHYKogAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/NueXHQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬