రక్తదాతలే ప్రాణదాతలు

  |   Telugunews

శ్రీకాకుళం : రక్తదాతలే ప్రాణదాతలని శ్రీకాకుళం ఎమ్మెల్యే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్చంధంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ సినినటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి జన్మదినోత్సవం సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం వద్ద మెగా రక్తదాన శిభిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెండ్ తైక్వాండో శ్రీను ఆద్వర్యంలో జిల్లాలోని మెగా ఫ్యామిలీ అభిమానులంతా కలిసి ఈ మెగా రక్తదాన శిభిరంలో పాల్గోని స్వచ్చంధంగా రక్తదానం చేసారు. ఈ శిభిరాన్ని ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అధిక సంఖ్యలో మెగా అభిమానులు రక్తదానం చేసేందుకు తరలిరావడంతో వారందరిని ఆయన అభినందించారు. రక్తనిధి కేంద్రంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన రక్త సేకరణ కార్యక్రమం వద్దకు వెళ్ళి రక్తదాతలకి పలుకరించి వారందరిని అభినందించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ… రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని మరింత ఉత్సాహంగా జీవించవచ్చన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున రక్తం కొరత ఉందని రక్తనిధి నిర్వాహకులు చెబుతున్నారని ఈ నేపధ్యంలో యువజనులు, మహిళలు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. చిరంజీవి అభిమానులు స్వచ్చంధంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తుండడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యులు కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతిఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. ఇదే సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన్ రావు రక్తనిధి సమస్యలను ధర్మాన దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి బ్లడ్ బ్యాంక్ అభివృద్దికి తన వంతు కృషి చేస్తానన్నారు. అవసరమైన మౌళిక సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అంధవరపు వరం, ఎం.వి.పద్మావతి, మాజీ వైస్ చైర్మన్ చల్లా అలివేలు మంగ, వైకాపా నేతలు శిమ్మ రాజశేఖర్, కె.ఎల్.ప్రసాద్, సుంకర కృష్ణకుమార్, హనుమంతు కిరణ్ కుమార్, గులోనా, కోణార్క్ శ్రీను,మండవల్లి రవి, పొన్నాడ రుషి, డా.పైడి మహేశ్వరరావు, వూణ్ణ నాగరాజు, నంబాళ్ళ రాజశేఖర్, సుగుణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే జిల్లా చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు వైశ్యరాజు మోహన్, రామ్ చరణ్ యువత అధ్యక్షుడు తైక్వాండో గౌతం, నానిచరనిజం, హరీష్,రాజేష్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అద్యక్షుడు పుక్కల నవీన్,తలాడ శేఖర్, అల్లు ఉదయ్, భాను బన్నీ, అనిల్, సిద్దు, సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షుడు జోగిపాటి వంశీ, కిరణ్, మౌళి, మరియూ అభిమానులు, నాని రాయల్, వడ్డీ శ్రీను, సీర రాజు, పెయ్యల చంటి, పండు, తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/DKL6mAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/hCQtSQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬