రజినీకాంత్ సినీ జీవితానికి 44 ఏళ్లు.. దుమ్ములేపుతున్న రజినీయిజం

  |   Tollywood

మనిషి చూడటానికి నల్లగా ఉంటారు. మరీ అంత ఎత్తు కూడా కాదు. బక్కపలచని శరీరం. నిజం చెప్పాలంటే హీరోకి ఉండాల్సిన భౌతిక లక్షణాల్లో ఆయనకున్నవి చాలా తక్కువే. కానీ, ఆయన అలా నడిస్తే చాలు వెండితెర షేక్ అయిపోతుంది. థియేటర్లు విజిల్స్‌తో మారుమోగిపోతాయి. రికార్డులు బద్దలైపోతాయి. ఈపాటికే అర్థమై ఉంటుంది ఆయనెవరో..!! ది వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్. పేరుకి ఆయన తమిళ హీరోనే అయినా ఆయనకు సౌతిండియా మొత్తం భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే జపాన్, హాంగ్ కాంగ్ వంటి దేశాల్లో కూడా తలైవాకు బోలెడంత మంది ఫ్యాన్స్.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని ఆయన అభిమానులు పండుగలా జరుపుకుంటున్నారు. ట్విట్టర్ టాప్ ట్రెండింగుల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. #44YrsOfUnmatchableRAJINISM హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో టాప్-3 ట్రెండింగ్‌గా రజినీకాంత్ తన హవా చూపిస్తున్నారు. అభిమానులు తయారుచేసిన పోస్టర్లతో ట్విట్టర్ నిండిపోతోంది....

ఫోటో - http://v.duta.us/bI6SuAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/b1ekUAAA

📲 Get Tollywood on Whatsapp 💬