విపత్కర పరిస్థితుల నుండి విముక్తి కల్పించండి

  |   Telugunews

పాతపట్నం : పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని హరిజన గోపాలపురం, కాపు గోపాలపురం గ్రామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నప్పటికీ ఒడిశా రాష్ట్రానికి అత్యంత దగ్గరగా ఉన్నప్పటికీ కూడా వారి పరిధిలో లేనందున రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నిర్లక్ష్యానికి వారు గురవుతున్నారని, దీనివలన ఆ రెండు గ్రామాల ప్రజలు కనీస వసతులు లేక దుర్భర జీవితం గడుపుతున్నారని, ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ గ్రామాల ప్రజలతో కలిపి వైకాపా నాయకుడు బి నారాయణ మూర్తి పర్లాకిమిడి నియోజకవర్గ శాసనసభ్యుడు కోడూరు నారాయణరావుకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ… పర్లాకిమిడి నుండి వస్తున్న వ్యర్థ పదార్థాలు, మురికి నీరు హరిజన గోపాలపురం, కాపు గోపాలపురం గ్రామాల పరిసర ప్రాంతాలలోకి వచ్చి నిలువ ఉంటుందని, వీటితో ఆసుపత్రి నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు ఉన్నాయని అన్నారు. వీటివలన పచ్చని పైరులు పాడైపోతున్నవని బోరు బావులు నుండి మురికినీరు వస్తుందని ప్రాణవాయువు విషవాయువు గా మారడం వలన అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు....

ఫోటో - http://v.duta.us/0EaLQAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/vGKLGAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬