సీఎం జగన్ ఆశయ సాధనకు కృషి చేయాలి

  |   Telugunews

మండపేట: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పనిచేయాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందని అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ పేర్కొన్నారు. మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ఆదివారం జరిగిన వాలంటీర్ల పరిచయ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మండపేట మున్సిపల్ కమీషనర్ త్రివర్ణ రామ్ కుమార్ అధ్యక్షతన వాలంటీర్ల పరిచయ కార్యక్రమం జరిగింది. అమలాపురం ఎంపి చింతా అనురాధ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవిన్యూ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ లు కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో వార్డు వాలంటీర్లుగా ఎంపికైన అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొని తమను తాము పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పిల్లి బోస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆశయ సాధనకు కృషి చేయాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు విస్తృత అధికారాలు కట్టబెట్టి ఘోర తప్పిదం చేసిందన్నారు. జన్మభూమి కమిటీల నాయకులు తమకు నచ్చిన వారిని మాత్రమే సంక్షేమ పథకాల్లో అర్హులుగా నిర్ణయించడంతో ప్రజా వ్యతిరేకత వచ్చిందన్నారు. అటువంటి తప్పులు వార్డు వాలంటీర్లు చేయవద్దని కోరారు. కులం, మతం, పార్టీ చూడవద్దన్నారు.తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సైతం అర్హులుంటే వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని సూచించారు. వివక్ష చూపకుండా పేదరికం మాత్రమే చూడాలని కోరారు. ప్రతీ ఇంట్లో ఓ కుటుంబ సభ్యుడిలా వాలంటీర్లు కలిసి పోవాలన్నారు. 50 కుటుంబాల్లో ఎవరు శుభకార్యం నిర్వహించుకున్నా మొదటి అతిథి మీరే అవుతారన్నారు.ఇది జరగబోయే యదార్ధమని పేర్కొన్నారు. పింఛన్లు మంజూరు చేయాలన్నా, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నా, ఏ పథకం అమలు చేయాలన్నా సరే వార్డు వాలంటీర్లకే విస్తృత అధికారాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్ కు సైతం అధికారాలు లేకుండా టీడీపీ ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుతం వార్డు వాలంటీర్లకు నేరుగా పర్యవేక్షణాధికారి ముఖ్యమంత్రి జగనేనని తెలిపారు. ఒక వేళ వాలంటీర్లు ఎక్కడైనా వివక్ష చూపితే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చన్నారు.పిర్యాదులో వాస్తవం ఉంటే 48 గంటల్లో చర్యలు ఉంటాయని బోస్ స్పష్టం చేసారు. వీటిని దృష్టిలో ఉంచుకుని వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి, వైసిపి రాష్ట్ర నాయకులు కర్రి పాపారాయుడు, రాష్ట్ర వైకాపా రైతు విభాగం కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, మంత్రి బోస్ తనయుడు పిల్లి సూర్య ప్రకాష్ (చిన్నబాబు) ,సొసైటీ అధ్యక్షులు కుక్కల రామారావు, పెంకే వెంకట్రావు, మాజీ కౌన్సిలర్లు ముమ్మిడివరపు బాపిరాజు, కొల్లి వరలక్ష్మి, కనికెళ్ళ పల్లవి, కోనే రమాదేవి, వెదురువలస ధనలక్ష్మి పార్టీ నాయకులు పోతంశెట్టి ప్రసాద్, పడాల సతీష్, ముక్కాదాలియ్య, కొవ్వాడ అప్పన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/JEPbDgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/EPe8UQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬