నాని హీరోయిన్‌తో ఆది రొమాన్స్.. ‘జోడి’ వచ్చేస్తుంది!

  |   Tollywood

యూత్‌ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆది నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా సోలో హీరోగా ఇంకా సరైన సక్సెస్‌ను అందుకోదు. ఇటీవల వచ్చిన ‘బుర్రకథ’ సినిమాపై ఆది ఆశలు పెట్టుకున్నా ఆ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. కాన్సెప్ట్ బాగున్నా దర్శకుడు రత్నబాబు తడబాటుతో సినిమాను సరిగా తెరకెక్కించలేకపోయారు. అయితే, ఇప్పుడు ఆది ఒక మంచి లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ ‘జోడి’.

కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ ఈ చిత్రంలో ఆదికి జోడీగా నటించారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తయింది. సెప్టెంబర్ 6న సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇటీవల విడుదలైన ‘జోడి’ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించారు. గతంలో ‘‘వాన, మస్కా, సినిమా చూపిస్త మామ’’ చిత్రాలకు విశ్వనాథ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పుడు ‘జోడి’ ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు....

ఫోటో - http://v.duta.us/CRHCagAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/5NkzegAA

📲 Get Tollywood on Whatsapp 💬