పార్టీలకతీతంగా రైతులకు సేవలందించాలి……. ఎమ్మెల్యే కొండేటి

  |   Telugunews

అంబాజీపేట: సహకార సంఘాలకు నూతనంగా నిర్మించబడిన త్రిసభ్య కమిటీ సభ్యులు గ్రామాల్లోని రైతులకు పార్టీలకతీతంగా సేవలు అందించాలని పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కోరారు. మండలంలోని ఇరుసుమండ సొసైటీ చైర్ పర్సన్ గా దంతులూరి శ్రీనివాసరాజు, సభ్యులుగా మామిడిశెట్టి రాజేశ్వరి, నాగాబత్తుల సత్యానందం లను ఆయన సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా మండల వైకాపా కార్యదర్శి ఎన్. నాగరాజు అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ నూతనంగా నియమించబడిన చైర్ పర్సన్, సభ్యులు ,రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సొసైటీ ల ద్వారా అందించాలన్నారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిందని ఇంతకుముందు ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు. అంతేకాకుండా కౌలు రైతులకు కూడా రైతు భరోసా కార్యక్రమం వర్తింప చేశామని అక్టోబర్ లో ప్రతి రైతుకు, కౌలు రైతుకు 12,500 వంతెన పెట్టుబడి సాయం రైతు భరోసా కింద మంజూరు చేస్తామన్నారు. పాలకవర్గాన్ని అభినందించిన వారిలో వైకాపా నాయకులు మంతెన రవి రాజు,కొమ్ముల కొండలరావు, పేరి శీను, కొర్లపాటి కోట బాబు, కూనపురెడ్డి వెంకట్రావు. తదితరులు ఉన్నారు .అనంతరం గ్రామ వాలంటీర్లు గా నియామక పత్రాలు పొందిన అభ్యర్థులను ఎమ్మెల్యే అభినందించారు.

ఫోటో - http://v.duta.us/KwL5_QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/fgOQhAAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬