వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం వైఫల్యం …….. స్టాలిన్ బాబు

  |   Telugunews

అంబాజీపేట: వరద బాధితులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని పి. గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నేలపూడి స్టాలిన్ బాబు మండిపడ్డారు. సోమవారం ఆయన టి.డి.పి నాయకులతో కలిసి వాకలగరువు, అగ్నికుల క్షత్రియ కాలనీలలో నీటమునిగిన ఇళ్ల ను పరిశీలించి, బాధితులతో మాట్లాడారు.అంబాజీపేట తహశీల్దార్ ఎల్.జోసెఫ్ తో సహాయ చర్యల పై మాట్లాడారు. చేపల వేటకు వెళ్ళలేని పరిస్థితిలో తమకు కుటుంబ పోషణ కష్టంగా ఉన్నదని అగ్నికుల క్షత్రియులు వాపోయారు.

వరద ప్రాంతాల ప్రజలను ఆదుకోవడంలో అధికార పార్టీ తీవ్రంగా వైఫల్యం చెందిందని స్టాలిన్ బాబు మండిపడ్డారు. బాధితులకు పరిహారం గాని, పశువులకు పశుగ్రాసం గానీ ఇప్పటివరకు అందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం వరద సమయంలో బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, పశువులకు గ్రాసం అందించడం జరిగిందన్నారు. వరద ప్రాంతాలకు వెళుతున్న స్థానిక శాసనసభ్యులు వాటిమాటే ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించడంలో వైఫల్యం చెందారని , వరద ప్రాంతాల విద్యార్థులకు సెలవులను ప్రకటించలేదన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి, పంట నష్టపోయిన రైతులకు, వేట కోల్పోతున్న అగ్నికుల క్షత్రియులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఒక్కక్కరికి యాభై కిలోల బియ్యం, వంట సామగ్రి అందించాలని, పశువులకు మొక్కజొన్న చొప్పలను అందించాలని డిమాండ్ చేశారు.అగ్నికుల క్షత్రియులకు రోజుకు రూ.500 చెల్లించాలని డిమాండ్ చేసారు. తెలుగుదేశం పార్టీ తరఫున బాధితులకు అండగా నిలుస్తామని, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొంటారని తెలిపారు.స్టాలిన్ బాబు వెంట టి.డి.పి నాయకులు క్రాప నాగభూషణం, ఎన్. వి.సుబ్బారావు,గెల్లా అశోక్,సీహెచ్.రాజు,ఏడిద నాగబాబు,నిమ్మకాయల చిన్న,సీహెచ్.రత్నరాజు,గంధం వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు

ఫోటో - http://v.duta.us/ib6Z7AAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/CMbKJQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬