నా లైఫ్‌లో అదే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్.. పవన్ గురించి డైరెక్టర్ బాబీ

  |   Tollywood

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పనిచేయాలని చాలా మంది దర్శకులకు కోరిక ఉంటుంది. కానీ, అందరికీ అది సాధ్యపడలేదు. ఇకపై సాధ్యపడుతుందో లేదో కూడా తెలీదు. అయితే, పవన్ కళ్యాణ్‌తో పనిచేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేదో ఇప్పటికీ చాలా మంది దర్శకులు చెబుతూనే ఉంటారు. తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ) పవన్‌తో తన అనుభవం గురించి వెల్లడించారు.

నేడు (సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘ఆయనతో కలిసి పనిచేయాలనేది ప్రతి ఒక్కరి కల. భయమంటే ఏమిటో తెలియని వ్యక్తి, గొప్ప నాయకుడు. నిద్రలేచిన ప్రతిరోజూ మిమ్మల్ని సెట్స్‌లో చూడటమనేది నా జీవితంలోనే గొప్ప అనుభవం. మీతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం సార్. ఇలాంటి రోజులు మీరు ఎన్నో జరుపుకోవాలి సార్. హ్యాపీ బర్త్‌ డే పవన్ కళ్యాణ్’ అని బాబీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు....

ఫోటో - http://v.duta.us/LtIRwAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/y68HegAA

📲 Get Tollywood on Whatsapp 💬