‘సాహో’ బాక్సాఫీస్ బ్యాంగ్.. రూ.300 కోట్ల చేరువలో ప్రభాస్ సినిమా

  |   Tollywood

‘సాహో’ బాక్సాఫీసు బ్యాంగ్ కొనసాగుతూనే ఉంది. సినిమాపై విమర్శకులు కారాలు మిరియాలు నూరినా.. కొంత మంది ప్రేక్షకులు పెదవి విరిచినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడలేదు. సినిమా ఎలా ఉన్న ఫర్వాలేదు తెరపై ప్రభాస్‌ను చూస్తే చాలు అన్నట్టుగా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు టాక్ చూసి ఈ రేంజ్ కలెక్షన్లు ఎవ్వరూ ఊహించలేదు. శుక్రవారంతో పోలిస్తే శనివారం కలెక్షన్ కాస్త తగ్గినా.. మళ్లీ ఆదివారం పుంజుకుంది. మూడు రోజుల్లో ‘సాహో’ ప్రపంచ వ్యాప్తంగా రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

వాస్తవానికి ‘సాహో’ ప్రభంజనం మొదటిరోజుకే పరిమితం అనుకున్నారు అంతా. కానీ, రెండో రోజు కూడా బాక్సాఫీసుని వసూళ్ల వరదతో ముంచెత్తింది ‘సాహో’. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’.. రెండు రోజుల్లో రూ.205 కోట్లు రాబట్టింది. ఇక తొలివారం ముగిసేసరికి మూడు రోజుల్లో రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది....

ఫోటో - http://v.duta.us/CxCgugAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/JicNggEA

📲 Get Tollywood on Whatsapp 💬