ఇద్దరు చిలకలతో మాస్ స్టెప్పులు.. చితక్కొట్టేస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'

  |   Tollywood

వరుసగా ఫ్లాప్స్ తీస్తున్న పూరికి, ఒక్క హిట్ వస్తే బావుండును అనుకుంటున్న రామ్‌కి కూడా ఊహించినదానికంటే పెద్ద హిట్‌గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. ఆ సినిమా థియేటర్స్‌లో కలెక్షన్స్ కుమ్మేసింది. సరయిన కంటెంట్‌తో వస్తే మాస్‌బొమ్మకి ఉండే పవర్ ఏంటి అనేది ఇస్మార్ట్ శంకర్ మరొకసారి ప్రూవ్ చేసి చూపించాడు. ముందు పెద్దగా అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం కొనుకున్నవాళ్లందరికి కూడా రూపాయికి రూపాయి మిగిలేలా చేసింది. ఆ సినిమా థియేటర్స్‌లో నుండి వెళ్ళిపోయినా చాలా మందికి మైండ్స్‌లో నుండి మాత్రం పోలేదు. అందుకే ఆ సినిమా ఆన్‌లైన్‌లో ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా అని వెయిట్ చేస్తున్నారు చాలామంది.

Also Read:

అయితే ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఆ సినిమా నుండి 'దిమాక్ ఖరాబ్' అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్స్‌లో ఆ సాంగ్‌కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అనేది అందరికి తెలిసిందే. మణిశర్మ ఇచ్చిన మాసీ ట్యూన్‌కి రామ్ వేసిన స్టెప్పులు మాస్ ప్రేక్షకుల్ని అసలు సీట్స్‌లో కూర్చోనివ్వకుండా చేసాయి. ఇక ఆ పాటలో ఒకపక్క నభా నటేష్, మరోపక్క నిధి అగర్వాల్ కూడా తమ అందాలతో ఇస్మార్ట్ శంకర్‌కి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చారు. దాంతో ఆ పాట కోసమే సినిమాకి వెళ్లిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు. ఆ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. దాంతో ఆ పాట మార్చకుండా చూసి ఆ పాటకి కొత్త రికార్డ్స్ కట్టబెడుతున్నారు ఇస్మార్ట్ శంకర్ ఫ్యాన్స్....

ఫోటో - http://v.duta.us/Q299WAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/I_zC4AAA

📲 Get Tollywood on Whatsapp 💬