ఎనర్జీలో అన్నయ్యను కొట్టినోడు మళ్ళీ పుట్టడు- పూరి జగన్నాథ్

  |   Tollywood

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'సైరా' సినిమా రిలీజ్‌కి అంతా రెడీ అయిపోయింది. కీలకమయిన సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేసుకుంది 'సైరా'. ఒక్క కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని మిస్ అయిన పూరి ఈ సినిమా గురించి, చిరంజీవి గురించి చెబుతూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఆ వీడియో చూస్తే పూరికి చిరు అంటే ఎంత ప్రేమో తెలుస్తుంది. చిరంజీవి 150వ సినిమాగా పూరి డైరెక్షన్‌లో 'ఆటో జానీ' చెయ్యాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ పూరి మాత్రం ఎప్పటికయినా చిరంజీవితో సినిమా చేస్తా అంటూనే ఉన్నాడు.

Also Read:

'సైరా' సినిమా గురించి తక్కువ మాటల్లోనే చాలా విషయాలు చెప్పుకొచ్చాడు ఈ డాషింగ్ డైరెక్టర్. ''కొన్నాళ్ల క్రితం చరణ్ నాతో ఒక మాట చెప్పాడు, డాడ్‌తో ఒక మెమరబుల్ సినిమా తియ్యాలి, మనందరం ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే సినిమా అవ్వాలి అని, మొన్న 'సైరా' ట్రైలర్ చూడగానే నాకు చరణ్ గుర్తుకొచ్చాడు. నిజంగా అలాంటి సినిమా తీసాడు, గ్రాండియర్ గానీ, విజువల్స్ గానీ..'' అంటూ 'సైరా' సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించాడు. అలాగే ఆ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి చెబుతూ ''సురేందర్ రెడ్డి అయితే ఇరగ్గొట్టేసాడు'' అని చెప్పుకొచ్చాడు....

ఫోటో - http://v.duta.us/UozDaAAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/FhH_TAAA

📲 Get Tollywood on Whatsapp 💬