గందరగోళం మధ్య విద్యాకమిటీ అధ్యక్షుల ఎన్నిక

  |   Telugunews

గుడ్లూరు , : విద్యా కమిటీ ఎన్నికల్లో పోటీలు నెలకొనడంతో గందరగోళం చోటుచేసుకుంది. కొంత సమయం తరువాత ఉపాధ్యాయులు చొరవ తీసుకొని విద్యా కమిటీ అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇరు వర్గాలతోటి చర్చించిన అనంతరం ఎన్నిక ఏకగ్రీవం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుడ్లూరు ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా మురారిశెట్టి కృష్ణ, ఉపఛైర్మన్‌గా కర్పూరపు లక్ష్మి, బసిరెడ్డిపాలెం ఉన్నత పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా నరాల సుబ్బారెడ్డి, వైస్‌ఛైర్మన్‌గా గొర్ల ధనమ్మ, చేవూరు ఉన్నత పాఠశాల ఛైర్మన్‌గా యం.వెంకటేశ్వర్లు, వైస్‌ ఛైర్మన్‌గా ఏల్చూని తిరుపతమ్మ, చినలాటరిపి పాఠశాల ఛైర్మన్‌గా కొమరగిరి మల్లిఖార్జున, వైస్‌ ఛైర్మన్‌గా కొప్పోలు అపర్ణ, మొగుళ్ళూరు కెజిబివి పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌గా యు.శ్రీలక్ష్మి, వైస్‌ ఛైర్మన్‌గా పి.జార్జిలు ఏకగ్రీవంగా ఎంపిక కావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమల్‌కుమార్‌, షెక్‌ సలీమ్‌ బాషా, చంద్రమౌళేశ్వరరావు, కెజిబివి సింధూ, చినలాటరిపి స్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసలు తెలిపారు. ప్రాధమిక పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్‌ల ఫలితాలు ఎక్కువ శాతం వాయిదా పడడంతో ఫలితాలు ఇంకా జరగాల్సి ఉంది.

ఫోటో - http://v.duta.us/0hVMyQAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/O8i4AgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬