చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటాం.. ఉయ్యాలవాడ వారసులు

  |   Tollywood

సైరా సినిమా హీరో చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్ తమకు న్యాయం చేయాలని ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారసులు డిమాండ్ చేస్తున్నారు. తమ నుంచి విలువైన సమాచారం తీసుకొని, తమ ఆస్తులు, స్థలాలు వాడుకొని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్రతో వ్యాపారం చేస్తున్న హీరో రామ్ చరణ్ తమను మోసం చేశారని ఆరోపించారు. తమకు న్యాయం జరక్కపోతే మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

సైరా నరసింహారెడ్డి పేరుతో చిత్రీకరించిన సినిమా కోసం తమ నుంచి సమాచారం తీసుకొని రామ్ చరణ్ ఇప్పుడు మొఖం చాటేశారని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం (సెప్టెంబర్ 23) హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు, దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సేవా సమితి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

Also Read:

తమకు న్యాయం చేస్తామని చిరంజీవి, రామ్ చరణ్ హామీ ఇవ్వాలని ఉయ్యాలవాడ వంశస్థులు డిమాండ్ చేశారు. వారు ఇచ్చిన మాట తప్పారని.. న్యాయం కోసం పోరాటం చేస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదల చేయొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు....

ఫోటో - http://v.duta.us/Tg0yLgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/sIm3DwAA

📲 Get Tollywood on Whatsapp 💬