టెక్నాలజీ పేరుతో నన్ను నానా హింసలు పెట్టారు: చిరంజీవి

  |   Tollywood

‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి దర్శకుడిగా సురేందర్ రెడ్డిని అనుకొని ఆ మాట అతనికి చెప్పగానే ఎగిరి గంతేస్తాడని తాను అనుకున్నానని.. కానీ, నాకు కొంత సమయం కావాలి సార్ అని ఆయన అడగడం తనను నిరుత్సాహపరిచిందని చిరంజీవి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తెరకెక్కించిన తీరును ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో వివరించిన చిరంజీవి.. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇంత భారీ బడ్జెన్ సినిమాతో వేరే నిర్మాతను రిస్క్‌లో పెట్టేకన్నా ఆ రిస్క్ ఏదో మనమే చేద్దాం డాడీ అని రామ్ చరణ్ చెప్పగానే తాను ‘సై’ అన్నానని చిరంజీవి వెల్లడించారు.

‘‘ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు చేయాలా? అనుకున్నప్పుడు పరుచూరి బ్రదర్స్‌ నన్ను దర్శకత్వం చేయమన్నారు. దర్శకుడు అనేది ఫుల్ ఫ్లెడ్జ్‌డ్ జాబ్. యాక్టింగ్ చేస్తూ దర్శకత్వానికి మనం న్యాయం చేయలేం. నేను చేయలేక కాదు.. ఏదో ఒకటి వదిలేయాలి. దేన్ని వదిలేయమంటారు? అనడిగాను. అమ్మమ్మో వద్దు డైరెక్షన్ వేరొకరిని పెట్టుకుందా. ఈ క్యారెక్టర్‌లో మిమ్మల్నే ఊహించుకున్నాం, మీరే చేయాలి అన్నారు....

ఫోటో - http://v.duta.us/Ce9pqgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/W4YR5wAA

📲 Get Tollywood on Whatsapp 💬