పాఠశాలల ఛైర్మన్‌ల ఎంపిక

  |   Telugunews

వలేటివారిపాలెం , : మండలంలోని మొత్తం 53 పాఠశాలలకు గాను 52 పాఠశాలలు ఏకగ్రీవంకాగా, మిగిలిన ఒక పాఠశాల ఎన్నికలు మాత్రం ఆగిపోయినట్లు వలేటివారిపాలెం ఎంఇఓ రవికుమార్‌ తెలిపారు. వలేటివారిపాలెం జెడ్‌పి పాఠశాల ఛైర్మన్‌గా బండి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చుండి మోడల్‌ స్కూలు ఛైర్మన్‌గా పెయ్యల మల్లిఖార్జున, పోకూరు జెడ్‌పి పాఠశాల గద్దె శ్రీనివాసులు, అంకభూపాల పురం ఎంపియుపి పాఠశాలలో ముంగమూరి తిరుపతయ్య, మాలకొండలోని ఎంపియుపి పాఠశాల పామినేని నరసింహం, అయ్యవారిపల్లి ఎంపియుపి పాఠశాల కుమ్మరి మల్లిఖార్జునలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్కూల్‌ ఛైర్మన్‌ల ఎంపికలో భాగంగా పోకూరు జెడ్‌పి పాఠశాలలో ఏర్పాటుచేసిన పేరెంట్స్‌ కమిటీ సమావేశానికి కందుకూరు టౌన్‌ ఎస్సై తిరుపతయ్య పాల్గొని విద్యార్ధులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులందరూ కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆయన అన్నారు. పాఠశాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు పాటించాలని విద్యార్ధులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్ధులందరూ ఎక్కువగా పేద విద్యార్దులే ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు మెరుగైన విద్యను అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోకూరు పాఠశాల హెచ్‌ఎం పద్మ, వెటర్నరీ డాక్టర్‌ కె.మల్లిఖార్జున పలువురు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఫోటో - http://v.duta.us/6C4atwAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Jb5NWgAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬