ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

  |   Telugunews

వేటపాలెం, మండలంలోని అందరు పంచాయితీ కార్యదర్శులు ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల అబివృద్ది అదికారి కె. నేతాజి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న కారణంగా దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు , డ్రయినేజిలలో ఎబేట్‌ ద్రావణం చల్లించుట , రోడ్ల వెంబడి నీటినిల్వలను తొలగింపు, త్రాగు నీటిని క్రమం తప్పక క్లోరినేషన్‌ చేయుట వంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో ఖాళీగా ఉన్న స్దలాలలోపిచ్చిమొక్కలు తొలగింపు, మురుగునిరు నిల్వ యుంటే వాటిని స్దల యజమానులు పూడ్పించు కోవాలని సూచించారు. ప్రభుత్వం ఆటో, మోటర్‌ కాబ్‌ ల వారికి నూతనంగా ప్రవేశ పెట్టిన 10వేల రూపాయల సాయాన్ని పొందేందుకు నిర్ణీత గడువులోగా ఆన్‌ లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. మండలంలో 1070 మంది ఉండగా ఇప్పటవరకు 240 ధరఖాస్తులు దాఖలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఫోటో - http://v.duta.us/WnPt1AAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/Mxl6pQAA

📲 Get తెలుగు వార్తలు on Whatsapp 💬