ప్రభాస్ ఫ్లైయింగ్ టు పారిస్.. ఎందుకోసం?

  |   Tollywood

బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ని నార్త్ ఇండియాలో చాలామంది బాహుబలి ప్రభాస్ అని పిలుస్తారు. కానీ సాహో సినిమాతో తన పేరునే నార్త్ ఇండియాలో ఒక బ్రాండ్ మార్క్‌గా మార్చుకోవాలి అనుకున్నాడు. అందుకే సాహో సినిమాకి యూవీ క్రియేషన్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెడితే, ప్రభాస్ కూడా అడిగినన్ని రోజులు కాల్ షీట్స్ ఇచ్చి, ఒకటికి రెండు సార్లు రీ షూట్స్ చేసి సాహో కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ ఆ సినిమా మాత్రం సినిమా టీమ్ అంచనాలకు దరిదాపుల్లో ఉండే రిజల్ట్ కూడా సాధించలేకపోయింది. దాంతో ఈ సినిమా కొనుకున్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారు. నిర్మాతలు షాక్ అయ్యారు. డైరెక్టర్ మూగబోయాడు. ఇక ఈ సినిమాని అందరికంటే ఎక్కువగా నమ్మిన ప్రభాస్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు.

Also Read:

సాహో సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా చూడమని చెప్పడానికి ఫార్మాలిటీ కోసం కూడా మీడియా ముందుకు రాలేదు. నిజానికి ఇలా ఒక ఊహించని అపజయం వచ్చినప్పుడు వేరే ఎవరయినా అయితే చేతిలో ఉన్న ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి, వీలైనంత త్వరగా రిలీజ్ చేసి మళ్ళీ హిట్ కొట్టాలని చూస్తారు. అయితే ప్రభాస్ మాత్రం అలా ఆలోచించలేదు. సాహో ఫెయిల్ అవ్వడానికి కారణాలు విశ్లేషించుకున్నాడు. ఈసారి అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ఉండేలా ఇప్పటివరకు షూట్ చేసిన జాను (వర్కింగ్ టైటిల్) ఫుటేజ్ అంతా చూసుకుని తెలుగు, హిందీ వెర్షన్స్ మళ్ళీ సెపరేట్‌గా షూట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అయితే స్క్రిప్ట్ లో కూడా మార్పులు అవసరం అని భావించిన ప్రభాస్ కాంప్రమైజ్ కాకుండా అవసరమయితే సినిమాని మళ్ళీ మొదటినుండి షూట్ చెయ్యడానికి కూడా ఓకే అన్నాడట....

ఫోటో - http://v.duta.us/PWx51QAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/iJOgUgAA

📲 Get Tollywood on Whatsapp 💬