పవన్ కాళ్లు పట్టుకున్న అభిమాని.. బౌన్సర్లను నెట్టి గుండెకు హత్తుకున్న జనసేనాని

  |   Tollywood

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేదికపై మాట్లాడుతుండగా.. ఆయన వెనుక మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు రాజమౌళి, వి.వి.వినాయక్, రామ్ చరణ్ వంటి హేమాహేమీలు ఉండగా.. ఒక అభిమాని వేదికపైకి దూసుకొచ్చాడు. జనసేనాని కాళ్లపై పడ్డాడు.

వెంటనే కొంత మంది బౌన్సర్లు ఆ కుర్రాడి చేతులు, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అంతే, పవర్ స్టార్‌కు కోపం కట్టలు తెచ్చుకుంది. ‘ఆప్ లోగ్ ఛలేజాయే.. అరే భాయ్, ఆప్ లోగ్ పీచే జాయే ప్లీజ్. ఛలే ఆప్’ అంటూ అరిచారు. ఆ కుర్రాడిని వేదికపైనే గుండెకు హత్తుకుని భుజం చరిచారు. అంతే, ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. ప్రపంచాన్ని జయించినంత ఆనందం ఆ కుర్రాడి సొంతం. మరోవైపు, గ్యాలరీల నుంచి మెగా అభిమానుల అరుపులు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. ‘సైరా’ వేడుకలోకి పవనిజం వచ్చింది....

ఫోటో - http://v.duta.us/OPekmgAA

పూర్తి వివరాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి - http://v.duta.us/I8c5qwAA

📲 Get Tollywood on Whatsapp 💬